తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇలియానా కసరత్తుల రహస్యం అదేనా..! - ఇలియానా

సన్నటి నడుముతో కుర్రకారు మనస్సు దోచుకున్న నటి ఇలియానా. చాలా రోజుల తర్వాత రవితేజ సరసన 'అమర్​ అక్బర్​ ఆంటోని' చిత్రంతో తెలుగు తెరపై రీఎంట్రీ ఇచ్చింది. అయితే తాజాగా ఓ పెద్ద హీరో సినిమా కోసం సన్నబడే ప్రయత్నాల్లో ఉందట ఈ అమ్మడు.

ఇలియానా కసరత్తుల రహస్యం ఇదేనా..!

By

Published : Sep 5, 2019, 5:31 AM IST

Updated : Sep 29, 2019, 12:08 PM IST

ప్రముఖ నటి ఇలియానా చాలా రోజులు వెండితెరకు దూరమైంది. ఓ విదేశీయుడితో ప్రేమలో పడ్డ ఈ భామ.. ఆయనతోనే చాలా రోజులు విదేశాల్లో గడిపింది. ఇటీవల అనూహ్యంగా అతనితో సంబంధాలు తెంచుకుని తిరిగి వెండితెరపై సందడి చేసింది. రవితేజ సరసన 'అమర్​ అక్బర్​ ఆంటోని' చిత్రంలో నటించింది. తాజాగా మెగాస్టార్​ చిత్రంలో ఓ పాత్ర కోసం రేసులో ఉందట.

ఇలియానా

దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్​ చిరంజీవి 152వ సినిమా రాబోతుంది. ప్రీ ప్రొడక్షన్​ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్ర బృందం... ఇందులో పాత్రల కోసం విజయశాంతి, ఐశ్వర్యరాయ్​, ఇలియానా వంటి ప్రముఖ నటులను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

బరువు తగ్గేందుకు...

తెలుగు సినీ పరిశ్రమలోకి ఇలియానా రీ ఎంట్రీ ఇచ్చినా... ఆమె బొద్దుగా ఉండటం వల్ల అవకాశాలు రావట్లేదట. ఈ కారణంగా బరువు తగ్గించుకోవాలని కొందరు దర్శకులు సూచించారట. దీంతో ఆమె ఆ పనిలో పడింది. ప్రతిరోజు జిమ్​లో వ్యాయామం చేస్తోందట. తాజాగా చిరు సరసన ఛాన్స్​ కొట్టేసేందుకు ఈ సుందరి మరింత కష్టపడుతోన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి...'చెట్లను నరకాలనే ఆలోచన మానుకోవాలి'

Last Updated : Sep 29, 2019, 12:08 PM IST

ABOUT THE AUTHOR

...view details