తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రియుడి ఆత్మీయ కౌగిలిలో ఇలియానా - హీరోయిన్​ ఇలియానా

ముంబయి విమానాశ్రాయంలో ఇలియానా, ఆమె ప్రియుడితో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ప్రియుడి కౌగిలింతలో ఇలియానా

By

Published : May 25, 2019, 4:16 PM IST

ఇలియానా పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ఆమె నాజూకైన నడుమే. 'దేవదాసు'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, 'పోకిరి'తో యువ హృదయాలను కొల్లగొట్టింది. అలాంటి ఇలియానా తన ప్రియుడు (భర్త) ఆండ్రూ నీబోన్‌తో కలిసి ముంబయి విమానాశ్రయంలో కనిపించింది. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ప్రేమికులైనా, భార్యాభర్తలైనా సరే దూరంగా ఉంటే ఆ ప్రేమ ఇంకా పెరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. అలాంటి సన్నివేశమే ఇలియానాకు జరిగింది. ఆండ్రూను విదేశాలకు సాగనంపుతూ ఒక్కసారిగా గట్టిగా హత్తుక్కొని మళ్లీ ఎప్పుడొస్తావు? అన్నట్లు చూసింది.

ప్రియుడు ఆండ్రూ నీబోన్​ కౌగిలిలో హీరోయిన్ ఇలియానా

ఇటీవలే ఓ ముఖాముఖిలో ఇలియానా మాట్లాడుతూ.. "నా ప్రియుడు చాలా మంచివాడు. నన్ను బాగా అర్థం చేసుకుంటాడు. వివాహం చేసుకున్నా లేదా కలిసున్నా పెద్ద తేడాలేదు. పెళ్లనేది పది మందికి తెలియడం కోసమే. మా మనసులు వివాహం కంటే బలంగా కలిసిపోయాయి. బాధల్లో ఉన్నప్పుడు ఆండ్రూ ప్రేమతో.. నన్ను ఓదార్చాడు. ఓ మనిషికి ఇంతకంటే ఏం కావాలి" అంటూ చెప్పుకొచ్చింది.

గతేడాది రవితేజతో కలిసి 'అమర్‌ అక్బర్‌ ఆంటోని'లో నటించింది ఇలియానా. ప్రస్తుతం హిందీలో అనీష్‌ బజ్మీ దర్శకత్వంలో ‘'పాగల్‌ పంతి'’లో నటిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details