కరోనా దెబ్బకు మరో జాతీయ ఈవెంట్ వాయిదా పడింది. భారత్‌లో బాధితుల సంఖ్య పెరుగుతున్న కారణంగా, బాలీవుడ్ ఆస్కార్స్‌గా పిలిచే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల(ఐఫా) కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈనెల 27-29 మధ్య ఈవెంట్ జరగాల్సింది ఉంది. అయితే ముందు జాగ్రత్త చర్యగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వహకులు ప్రకటించారు.
ఐఫా వేడుకలు వాయిదా.. కరోనా ప్రభావమే కారణం - cinema news
సినిమా అవార్డుల కార్యక్రమానికి కరోనా ఎఫెక్ట్ తగిలింది. మన దేశంలో ఈ వైరస్ బారినపడ్డ బాధితుల సంఖ్య పెరుగుతుండటం వల్ల ఈ ఈవెంట్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఐఫా వేడుకలు వాయిదా.. కరోనా ప్రభావమే కారణం
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వేదికగా జరగబోయే ఈ వేడుకల కోసం ఆహ్వానప్రతులు పంపడం సహా, అంతా సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు కరోనా ప్రభావం వల్ల ఈవెంట్‌నే వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం భారత్‌లో 30 మందికి పైగా ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా దాదాపు 3,300 మందికిపైగా చనిపోయారు. 98 వేల మందికి బాధపడుతున్నారు.