భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) వాయిదా పడింది. నవంబర్ 20 నుంచి 28 మధ్య గోవాలో జరగాల్సిన 51వ చిత్రోత్సవాలను వచ్చే ఏడాది జనవరి 16 నుంచి 24 తేదీల మధ్య నిర్వహించాలని నిర్ణయించినట్టు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు. కరోనా వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్‌తో చర్చించిన అనంతరం ఈ ప్రకటన జారీ చేసినట్టు తెలిపారు.
భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వాయిదా - IFFI postponed
కరోనా వల్ల భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వాయిదా పడింది. ఈ ఏడాది జరగాల్సిన కార్యక్రమాన్ని.. 2021 జనవరి 16 నుంచి 24తేదీల మధ్య నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు.

భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వాయిదా
అన్ని మార్గదర్శకాలను అనుసరించి.. హైబ్రిడ్ పద్ధతి (వర్చువల్, ఫిజికల్)లో ఈ కార్యక్రమం నిర్వహించాలని సంయుక్తంగా నిర్ణయించినట్లు జావడేకర్ వెల్లడించారు.