గోవాలో నిర్వహించిన 51వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫి) చిత్రోత్సవాలు ఆదివారంతో పూర్తయ్యాయి. ముగింపు కార్యక్రమంలో రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వచ్చిన డానిష్ చిత్రం 'ఇన్టు ది డార్క్నెస్' గోల్డెన్ పీకాక్ అవార్డు దక్కించుకుంది. అండర్స్ రెఫ్న్ దర్శకత్వం వహించారు.
'ఇన్టు ది డార్క్నెస్' సినిమాకు 'గోల్డెన్ పీకాక్' - మూవీ న్యూస్
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అంగరంగ వైభవంగా జరిగింది. డానిష్ సినిమా 'ఇన్టు ది డార్క్నెస్' గోల్డెన్ పీకాక్ అవార్డు గెలుచుకుంది.
నాజీల ఆక్రమణ సమయంలో డెన్మార్క్ ప్రజలు ఎదుర్కొన్న సంక్లిష్ట పరిస్థితులను, మానసిక కల్లోలాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇప్పుడీ అవార్డులో భాగంగా చిత్ర దర్శక నిర్మాతలకు తలో రూ.40 లక్షల నగదు బహుమతులతో పాటు ప్రశంస పత్రం అందించనున్నారు. ఈ ఈవెంట్లో భాగంగా 244 సినిమాల్ని వేరు వేరు విభాగాల్లో ప్రదర్శించారు. ముగింపు చిత్రంగా కియోషి కురసోవా రాసిన జపనీస్ చారిత్రక నాటకం 'వైఫ్ ఆఫ్ ఎ స్పై'ని ప్రదర్శించారు.
మెరిసిన బ్రిడ్జ్: 51 ఇఫి చిత్రోత్సవాల్లో అసోం దర్శకుడు క్రిపాల్ కలిత స్పెషల్ మెన్షన్ అవార్డు అందుకున్నారు. ఆయన తెరకెక్కించిన 'బ్రిడ్జ్' చిత్రానికి ఈ పురస్కారం దక్కింది. ఏటా బ్రహ్మపుత్ర నది వల్ల వచ్చే వరదలకు అసోంలోని గ్రామీణ ప్రజలు ఎలాంటి ప్రభావితం అవుతున్నారనే విషయాన్ని ఇందులో చూపించారు.