తెలంగాణ

telangana

ETV Bharat / sitara

IFFI 2021: ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్న హేమమాలిని - ఐఎఫ్​ఎఫ్​ఏ 2021

52వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ(IFFA 2021) వేడుకలు గోవాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో బాలీవుడ్​ సీనియర్​ నటి హేమమాలిని(hemamalini awards) 'ఇండియన్​ ఫిల్మ్​ పర్సనాలిటీ ఆఫ్​ ది ఇయర్​' పురస్కారాన్ని అందుకున్నారు.

హేమమాలినికి అవార్డు, Hema Malini receives Indian Film Personality of the Year award
హేమమాలినికి ఇండియన్​ ఫిల్మ్​ పర్సనాలిటీ ఆఫ్​ ది ఇయర్ అవార్డు

By

Published : Nov 20, 2021, 7:12 PM IST

గోవా వేదికగా 52వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ(IFFA 2021) వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పలువురు నటులు, కళాకారులు పురస్కారాలను అందుకున్నారు. వీరిలో బాలీవుడ్​ సీనియర్​ నటి హేమమాలిని(hemamalini awards) కూడా ఉన్నారు. ఆమెకు 'ఇండియన్​ ఫిల్మ్​ పర్సనాలిటీ ఆఫ్​ ది ఇయర్​' పురస్కారాన్ని ప్రదానం చేసి సత్కరించారు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్. ఈ వేడుకలో స్టార్​ హీరో సల్మాన్​ ఖాన్​, ప్రముఖ నిర్మాత కరణ్​ జోహర్​ కూడా పాల్గొన్నారు.

హేమమాలినికి ఇండియన్​ ఫిల్మ్​ పర్సనాలిటీ ఆఫ్​ ది ఇయర్ అవార్డు

ఈ చలన చిత్రోత్సవ వేడుకలో(international film festival of india 2021 awards) తొలిసారి ఓటీటీ ప్లాట్​ఫామ్స్​ కూడా పాల్గొనడం విశేషం. సత్యజిత్​ రే జీవిత సాఫల్య పురస్కారాన్ని అమెరికన్​ ఫిల్మ్​మేకర్​ మార్టిన్​ స్కార్సిసి, హంగేరియన్​ దర్శకుడు ఇస్త్వాన్​ జాబో(Istvan Szabo) అందుకున్నారు. నవంబర్ 28 వరకు ఈ చలనచిత్రోత్సవ వేడుకలు జరగనున్నాయి.

హేమమాలినికి ఇండియన్​ ఫిల్మ్​ పర్సనాలిటీ ఆఫ్​ ది ఇయర్ అవార్డు
భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకల్లో సల్మాన్​ఖాన్​

ఇదీ చూడండి:'పుష్ప' అప్డేట్​.. 'బ్రో', 'క్యాలీఫ్లవర్'​ ట్రైలర్స్​

ABOUT THE AUTHOR

...view details