తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సుశాంత్​ కేసుపై రంగంలోకి దిగిన కేంద్ర మాజీ మంత్రి - Subramanian Swamy on CBI inquiry into Sushant's death

బాలీవుడ్​ యంగ్​ హీరో సుశాంత్​ ఆత్మహత్య కేసు సీబీఐ విచారణకు తగినదో లేదో తెలుసుకోవాలనే బాధ్యతను ప్రముఖ న్యాయవాది ఇష్కరణ్​ సింగ్​కు అప్పగించారు కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్య స్వామి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్​ చేశారు. ఇప్పటికే పోలీసులు ఈ కేసులో పలువురిని విచారించారు.

sushanth
సుశాంత్​

By

Published : Jul 11, 2020, 4:13 PM IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని పలువురు సెలబ్రిటీలు, అభిమానులు డిమాండ్​ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయం గురించి తెలుసుకునేందుకు కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్య స్వామి రంగంలోకి దిగారు. ప్రముఖ న్యాయవాది ఇష్కరణ్ సింగ్ భండారీకి సుశాంత్ కేసు.. సీబీఐ విచారణకు తగినదో లేదో కనుక్కోవాలనే బాధ్యతను అప్పగించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్​ చేశారు.

ఈ కేసులో పోలీసులు చెబుతున్న విషయాలు సరైనవా.. కాదా అనే కోణంలో కూడా పరిశీలన చేయాలని భండారీతో చెప్పినట్లు స్వామి మరో ట్వీట్‌ చేశారు. దీంతో పాటు ఈ కేసుకు సంబంధించి అప్​డేట్స్​ కోసం ఇష్కరణ్​ భండారీ ట్విట్టర్​ ఫాలో అవ్వాలని సూచించారు.

వాంగ్ములాలు సేకరిస్తున్నారు

ప్రస్తుతం సుశాంత్ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు అతడి కుటుంబసభ్యులు, స్నేహితులు, పలువురు సినీ తారలను విచారించి స్టేట్​మెంట్స్​ రికార్డు చేశారు. ఇటీవల ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కూడా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.

భాజపా ఎంపీ రూపా గంగూలీ, మనోజ్​ తివారీ, నటుడు శేఖర్​ సుమన్​ సహా పలువురు ప్రముఖులు కూడా సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇది చూడండి : సాంకేతిక విప్లవానికి నాంది.. పద్మాలయ స్టూడియోస్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details