తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వారిద్దరూ పెళ్లి చేసుకుంటే నేను చాలా హ్యాపీ' - alia bhatt ranbir kapoor

దర్శక-నిర్మాత కరణ్​ జోహార్ నిర్వహిస్తున్న టాక్​షోలో పాల్గొన్నారు హీరోయిన్లు కరీనా కపూర్,అలియా భట్. అందులో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలియా-రణ్​బీర్ ప్రేమ వ్యవహారం గురించి కూడా ఈ కార్యక్రమంలో చర్చించారు.

హీరోయిన్ కరీనా కపూర్

By

Published : Oct 14, 2019, 12:16 PM IST

బాలీవుడ్ జోడి రణ్​బీర్ కపూర్​-అలియా భట్.. గత రెండేళ్ల నుంచి ప్రేమలో మునిగితేలుతున్నారు​. ఒకవేళ వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే, ప్రపంచంలో తన కంటే ఎక్కువ సంతోషించేవారు ఉండరని అంటోంది హీరోయిన్ కరీనా కపూర్. ముంబయిలో ఆదివారం జరిగిన 'ఎమ్ఏఎమ్ఐ సినిమా మేళా విత్​ స్టార్' కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయం చెప్పింది.

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత-దర్శకుడు కరణ్​ జోహార్.. "ఎప్పుడైనా కరీనా కపూర్‌ నీకు వదిన అవుతుందని అనుకున్నావా" అని అలియాను ప్రశ్నించగా, ఆమెకంటే ముందే స్పందించిన కరీనా "అలియా నాకు మరదలైతే ప్రపంచంలో నాకన్నా సంతోషించే వ్యక్తి ఇంకెవరు ఉండరేమో" అంటూ సమధానమిచ్చింది.

రణ్​బీర్ కపూర్-అలియా భట్

అనంతరం మాట్లాడిన అలియా.. ఇంతవరకు ఈ విషయం గురించి ఆలోచించలేదని, ప్రస్తుతానికైతే ఆలోచించకూడదని అనుకున్నానని చెప్పింది.

ఒకేవేళ పెళ్లి చేసుకుంటే, కరీనా కపూర్​లా సినీ కెరీర్​ను సమన్వయం చేసుకోవాలని అలియాకు సూచించాడు కరణ్. ఈ వ్యాఖ్యలపై స్పందించిందీ భామ. తనకు ప్రేరణనిచ్చిన వారిలో కరీనా ఒకరని చెప్పింది. ఎవరైనా వివాహం చేసుకున్న తర్వాత సినిమాలు చేయడంలో నెమ్మదిస్తారు. కానీ ఆమె మాత్రం ఈ పద్ధతిని మార్చేసిందని తెలిపింది అలియా.

ప్రస్తుతం కరీనా కపూర్, అలియా భట్.. కరణ్​ జోహార్ తెరకెక్కిస్తున్న 'తఖ్త్' సినిమాలో కలిసి నటిస్తున్నారు. త్వరలోనే సెట్స్​ పైకి వెళ్లనుందీ చిత్రం.

ABOUT THE AUTHOR

...view details