తెలంగాణ

telangana

ETV Bharat / sitara

క్రిస్మస్ కానుకగా 'ఇద్దరి లోకం ఒకటే'.. - idhari lokam okate release date

యువ కథానాయకుడు రాజ్​తరుణ్, షాలిని పాండే ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'ఇద్దరి లోకం ఒకటే'. ఈ సినిమాను డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చెప్పింది చిత్రబృందం.

ఇద్దరి లోకం ఒకటే

By

Published : Nov 1, 2019, 3:16 PM IST

ప్రతి ఏడాది రెండు, మూడు చిత్రాలతో అలరిస్తుంటాడు యువ కథానాయకుడు రాజ్‌ తరుణ్‌. ఈ ఏడాది మాత్రం కొంచెం విరామం తీసుకొని చేసిన సినిమా 'ఇద్దరి లోకం ఒకటే'. షాలిని పాండే కథానాయిక. ఈ చిత్ర విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం తెలిపింది.

ఇద్దరి లోకం ఒకటే

ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన మిక్కి జే మేయర్‌ బాణీలు... సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. ఈ చిత్రంలో రాజ్‌ తరుణ్‌ పాత్ర విభిన్నంగా ఉంటుందట.

ఇవీ చూడండి.. సమీక్ష : 'మీకు మాత్రమే చెప్తా' ఎలా ఉందంటే..

ABOUT THE AUTHOR

...view details