తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇంద్రభవనంలా అల్లు అర్జున్ ఇల్లు.. ప్రత్యేకతలివే! - Allu arjun

Allu Arjun House: ఐకాన్​స్టార్​ అల్లు అర్జున్.. స్టైలే వేరు. దుస్తులు, హెయిర్​ స్టైల్​ దగ్గర నుంచి క్యారవాన్ వరకు ప్రతిదానిపై ప్రత్యేక శ్రద్ధచూపించి.. అభిరుచికి తగినట్లుగా తీర్చిదిద్దుతారు. అందుకే ఆయనకు స్టైలిష్​ స్టార్​ అనే బిరుదూ ఉంది. అందుకు తగ్గట్లే తన ఇంటినీ ఇంద్ర భవనంలా మార్చి ఔరా అనిపిస్తున్నారు బన్నీ.

allu arjun house
అల్లు అర్జున్ ఇల్లు

By

Published : Jan 31, 2022, 3:21 PM IST

Allu Arjun House: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్.. 'పుష్ప' సినిమాతో పాన్​ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. కరోనా పరిస్థితుల్లోనూ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మాస్​ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

మరోవైపు అల్లుఅర్జున్​ హైదరాబాద్​లో తాను నివసిస్తోన్న ఇంటిని ఎన్నో హంగులతో నిర్మించుకున్నారు. స్విమ్మింగ్ పూల్, క్వాలిటీ ఫర్నీచర్, ప్రత్యేకమైన డిజైనింగ్​తో తన ఇంటిని ఇంద్రభవనంలా మార్చుకున్నారు. ఈ ఇంటికి ఉన్న మరిన్ని ప్రత్యేకతలు ఏంటో?. దాని డిజైనర్​ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

అల్లు అర్జున్ ఇల్లు

బ్లెస్సింగ్..

బన్నీ తన డ్రీమ్​ హౌస్​కు 'బ్లెస్సింగ్' అనే పేరు పెట్టుకున్నారు. ఈ ఇంట్లో అల్లుఅర్జున్ సహా ఆయన భార్య స్నేహలతా రెడ్డి, వారి పిల్లలు అర్హ, అయాన్ నివసిస్తున్నారు. వీరితో పాటు తమ పెంపుడు శునకం కజోకు కూడా ఈ ఇంట్లోనే ఉంటుంది. కాగా, బ్లెస్సింగ్​ విస్తీర్ణం 8000 చదరపు అడుగులు.

డైనింగ్ టేబుల్

స్విమ్మింగ్​ పూల్, డైనింగ్​ హాల్​కు సులభంగా చేరుకునేలా ఇంటిని దీర్ఘచతురస్రాకారంలో ఉండే డబ్బాలా నిర్మించారు. ఇంటిలోకి ప్రవేశించగానే పెద్ద కారిడార్​ ఉంటుంది. ఆ కారిడార్​పై వెళ్తే నేరుగా స్విమ్మింగ్ పూల్ వస్తుంది. అయితే.. ఈ ఇంటిని నిర్మించింది ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆమిర్ శర్మ కావడం విశేషం.

స్విమ్మింగ్ పూల్

బన్నీకి నచ్చేలా..

బన్నీకి నచ్చేలా ఈ ఇంటిని నిర్మించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినట్లు ఆర్కిటెక్ట్ శర్మ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రెండు విధాలుగా ఉపయోగించుకునే విధంగా మూవబుల్ బెంచీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఇంటి నిర్మాణానికి లో మెయింటనన్స్ మెటీరియల్ ఉపయోగించినట్లు వెల్లడించారు. ముందుభాగంలో ఎలాంటి డిజైన్​లు ఉపయోగించలేదని, కేవలం గ్లాస్​ను మాత్రమే అమర్చామని తెలిపారు. ఇంటి ముందు భాగాన్ని ప్లేన్​గా ఉంచితేనే బాగుంటుందని బన్నీని ఒప్పించినట్లు స్పష్టం చేశారు.

ఇంద్రభవనంలా అల్లుఅర్జున్ ఇల్లు

'పిల్లల కోసం కూడా గదులను ప్రత్యేకంగా నిర్మించాం. కలర్​ఫుల్​ నర్సరీలా కనిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం.' అని శర్మ పేర్కొన్నారు.

అల్లుఅర్జున్ ఇల్లు

వీటితో పాటు.. టెలివిజన్​ కోసం కూడా ఈ ఇంటిలో ప్రత్యేకంగా ఓ గదిని నిర్మించారు. కుటుంబంతో కలిసి జాలీగా సమయాన్ని గడిపేందుకు టెలివిజన్ రూమ్​లో ప్రత్యేకమైన కుర్చీలు ఏర్పాటు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

Anasuya khiladi: 'ఖిలాడి'లో అనసూయ డబుల్ ధమాకా!

కీర్తి సురేశ్​కు కరోనా ప్రతి వేవ్​లోనూ ఎదురుదెబ్బలే!

ABOUT THE AUTHOR

...view details