తెలంగాణ

telangana

By

Published : Apr 3, 2021, 2:12 PM IST

ETV Bharat / sitara

విజయ్ చిత్రంలో నటించట్లేదు: విద్యుత్

యాక్షన్ చిత్రాల్లో నటించి తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యంతో మెప్పించిన నటుడు విద్యుత్ జమ్వాల్. ప్రస్తుతం ఇతడు విజయ్ సినిమాలో విలన్​గా చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించాడు జమ్వాల్.

Vidyut  jamwal
విద్యుత్ జమ్వాల్

అతడికి మార్షల్ ఆర్ట్స్‌లో ఎంతో నైపుణ్యం ఉంది. ఎలాంటి ఫైట్స్ అయినా చాలా ఈజీగా చేయగలడు. అతడే.. 'కమాండో' సిరీస్ వంటి యాక్షన్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న బాలీవుడ్‌ నటుడు విద్యుత్‌ జమ్వాల్‌. కొంతకాలంగా తమిళ నటుడు విజయ్‌ 'దళపతి 65' చిత్రంలో ఇతడు విలన్‌గా‌ నటిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ట్విట్టర్ వేదికగా స్పందించాడు విద్యుత్.

"అతనితో కలిసి నటించాలని ఉంది. కానీ ఈ వార్త మాత్రం నిజం కాదు" అని తెలిపాడు జమ్వాల్. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. సన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మితమౌతోన్న ఈ సినిమా పూజా కార్యక్రమం ఇటీవల ప్రారంభమైంది. విద్యుత్ జమ్వాల్ గతంలో విజయ్‌తో కలిసి 'తుపాకీ' చిత్రంలో ప్రతినాయకుడిగా నటించాడు. తెలుగులో ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన 'శక్తి', 'ఊసరవెల్లి' చిత్రాల్లోనూ ప్రతినాయకుడిగా మెప్పించాడు. ప్రస్తుతం 'సనక్‌' అనే హిందీ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details