తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నా వంట చూసి నవ్వుకునేవారు: ప్రియమణి - నాకు గుడ్లు ఉడకపెట్టడం రాదు ప్రియమణి

ప్రస్తుతం టెలివిజన్ షోలతో పాటు పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది సీనియర్ నటి ప్రియమణి. ఈమె నటించిన 'హిజ్ స్టోరీ' అనే వెబ్​సిరీస్ ఇటీవలే విడుదలైంది. తాజాగా ఈ సిరీస్ గురించి మాట్లాడిందీ నటి.

Priyamani
ప్రియమణి

By

Published : Apr 29, 2021, 6:46 PM IST

ఒకప్పుడు తెలుగులో వరుస చిత్రాల్లో కథానాయికగా అలరించింది నటి ప్రియమణి. ప్రస్తుతం టెలివిజన్‌ షోలతో పాటు, పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. అంతేకాదు, 'హిజ్‌ స్టోరీ' అనే హిందీ వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఇందులో ఆమె సాక్షి అనే చెఫ్‌ పాత్రలో కనిపించనుంది. తాజాగా ఈ సినిమాలోని తన పాత్ర గురించి స్పందించింది.

"ఈ చిత్రంలో నేను చెఫ్‌గా నటించా. కానీ, నిజంగా నాకు కోడి గుడ్డు ఉడకబెట్టడం కూడా తెలియదు. సినిమా షూటింగ్‌ సెట్‌లో ఉన్న యువకులు నాకంటే బాగా వంటచేసేవారు. అలాంటిది నేను వంటగదిలో చేసే పోరాటాన్ని చూసి సెట్లో అందరూ నవ్వుకునేవారు. ఇక తోటి సహనటులైతే నాపై జోకులు వేసుకునేవారు. ఇందులో నా నటనను చూసి ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు."

-ప్రియమణి, నటి

ప్రశాంత్‌ భాగియా దర్శకత్వంలో బాలాజీ టెలిఫిల్మ్స్, డింగ్ ఇన్ఫినిటీ సంస్థలు కలిసి ఈ వెబ్‌సిరీస్‌ చిత్రాన్ని నిర్మించాయి. తన్వీర్‌ బుక్‌వాలా నిర్మాత. ఇందులో సత్యదీప్‌ మిశ్రా, మృణాల్‌దత్‌ కీలక పాత్రల్లో నటించగా నితిన్ భాటియా, పరిణిత సేథ్, రాజీవ్ కుమార్, చారు శంకర్, మిఖాయిల్ గాంధీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ALT బాలాజీ ఓటీటీ వేదికగా ఏప్రిల్ 25న ఈ సిరీస్‌ విడుదలైంది.

ప్రియమణి ప్రస్తుతం 'విరాటపర్వం', 'నారప్ప' చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హిందీలో అజయ్‌ దేవగణ్‌తో కలిసి 'మైదాన్‌’' చిత్రంలో చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details