పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'వకీల్‌సాబ్'. నివేదా థామస్, అంజలి, అనన్య కీలకపాత్రల్లో నటించారు. మహిళా సాధికారత ప్రధానాంశంగా ఈ చిత్రం తెరకెక్కింది. దాదాపు మూడేళ్ల తర్వాత పవర్‌స్టార్ ఈ సినిమాతో తెరపై కనిపించారు. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో 'వకీల్‌సాబ్' గురించి నివేదా ఫ్యాన్స్‌తో ముచ్చటించారు..
ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది?
నివేదా: ఇప్పుడు కొంచెం ఆరోగ్యంగానే ఉన్నాను. నా యోగక్షేమాలు అడిగినందుకు ధన్యవాదాలు.
పవన్‌కల్యాణ్‌తో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
నివేదా: కమర్షియల్ హంగులు లేనప్పటికీ ఇలాంటి కథలో నటించడానికి ఒప్పుకొని ఇందులో భాగమైనందుకు పవన్ సర్‌కి ముందు థ్యాంక్స్ చెప్పాలి. ఆయనకు ఉన్న క్రేజ్ కారణంగా ఈ కథ ఎంతోమందికి చేరువవుతుంది. ఆయనతో కలిసి స్క్రీన్ పంచుకోవడం ఓ అద్భుత అనుభవాన్ని అందించింది.
వకీల్‌సాబ్‌లో మీకు నచ్చిన పాట?
నివేదా: మగువా మగువా
మీరు పోషించిన పాత్ర గురించి..?