అనిల్ కపూర్ నటిస్తున్న ఓ సినిమాపై భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన కొత్త సినిమా 'ఏకే వర్సెస్ ఏకే' ట్రైలర్లో తమ యూనిఫామ్‌ను తప్పుగా ధరించారని అసంతృప్తి చెందింది. ఆ సన్నివేశాలను తొలగించాలని చిత్రబృందానికి ట్విట్టర్ వేదికగా సూచించింది.
"ఈ వీడియోలో ఐఏఎఫ్ యూనిఫామ్‌ను తప్పుగా ధరించారు. వాళ్లు ఉపయోగించిన భాష కూడా సరిగ్గా లేదు. ఇది భారత సాయుధ దళాలలో ఉన్నవారి ప్రవర్తనా నిబంధనలకు అనుగుణంగా లేదు. సంబంధిత దృశ్యాలను తొలగించాలి."