Dhanush movie songs: ధనుష్.. ఈ హీరో మల్టీ టాలెంటెండ్. హీరో, రచయిత, సింగర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్.. ఇలా చాలా వాటిలో తన ప్రతిభ చూపి అదరగొట్టారు. ప్రస్తుతం తెలుగులోనూ రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో 'సార్', డైరెక్టర్ శేఖర్ కమ్ములతో చిత్రాలు ఉన్నాయి. హాలీవుడ్లోనూ 'గ్రే మ్యాన్' సినిమాలో నటిస్తున్నారు ధనుష్. అయితే తన సినిమలోని ఓ పాటను కేవలం ఆరు నిమిషాల్లో రాశానని గతంలో ధనుష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంతకీ ఆ పాటేంటి? దాని సంగతేంటి?
ధనుష్ భార్య ఐశ్వర్య దర్శకత్వం వహించిన సినిమా '3'. మానసిక సమస్యలు నేపథ్య కథాంశంతో తీసిన ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటించారు. ఇందులోని 'కొలవెరి డీ' పాట స్వయంగా రాసి, పాడారు కూడా. ఈ సాంగ్నే కేవలం ఆరు నిమిషాల్లో రాశారు.