దక్షిణాది చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల బాలీవుడ్‌పై అంతగా ఆసక్తి చూపలేదని అంటోంది నటి రాశీ ఖన్నా. తెలుగు చిత్రపరిశ్రమ నుంచే కాకుండా ప్రేక్షకుల నుంచి విశేషాదరణ లభిస్తోంది. ఇక వేరొక దానిపై ఆసక్తి చూపలేకపోయానని చెబుతోంది.
'దక్షిణాది చిత్రాలకు ఓకే..బాలీవుడ్‌కు వెళ్లను' - రాశీ ఖన్నా మద్రాస్ కేఫ్ న్యూస్
ప్రస్తుతం హిందీ చిత్రాల్లో నటించే ఆలోచనే లేదంటోంది నటి రాశీ ఖన్నా. దక్షిణాది ప్రేక్షకులు తనను విశేషంగా ఆదరిస్తున్నారని చెబుతోంది. నటిగా సినీప్రయాణం సంతోషకరంగా సాగుతుందని వెల్లడించింది.
హిందీ సినిమా 'మద్రాస్ కేఫ్'తో నటిగా వెండితెరపైకి వచ్చారు. మళ్లీ హిందీలో నటించలేదెందుకు?
రాశీ ఖన్నా:హిందీలో నటించకపోవడానికి ప్రత్యేకంగా కారణాలంటూ ఏం లేవు. అక్కడ తొలి సినిమా చేస్తున్న సమయంలోనే తెలుగులో 'మనం' చేసే ఛాన్స్ దొరికింది. ఆ వెంటనే 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో సోలో కథానాయికగా మంచి విజయాన్ని అందుకున్నా. ఆ తర్వాత నుంచి వరుస సినిమాలతో ఇక్కడే బిజీ అయిపోయా. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు, పరిశ్రమ నుంచి బోలెడంత ప్రేమ లభిస్తోంది. ఇక మళ్లీ ప్రత్యేకంగా హిందీ గురించి ఆలోచించడం దేనికి అనిపిస్తోంది? పైగా నేనెప్పుడో కుటుంబం సహా హైదరాబాద్‌కి మకాం మార్చేశా. అవకాశమొస్తే తమిళం, మలయాళ చిత్రాల్లో నటిస్తా కానీ, హిందీ వైపు వెళ్లే ఆలోచన లేదు. ప్రస్తుతం నాకిక్కడ మంచి పాత్రలొస్తున్నాయి. నటిగా నా ప్రయాణం చాలా సంతృప్తికరంగా సాగుతోంది. ఇది చాలు.