తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇకపై అలాంటి పాత్రలు చేయను: సోనూసూద్

నటుడు సోనూసూద్ ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతినాయక లక్షణాలున్న పాత్రల్లో నటించనని స్పష్టం చేశారు.

I will only do positive roles now: Sonu Sood
ఇకపై నెగటివ్​ రోల్స్​లో నటించను: సోనూసూద్

By

Published : Dec 16, 2020, 6:00 PM IST

కరోనా లాక్​డౌన్​లో వలస కార్మికులకు సహాయం చేసిన నటుడు సోనూసూద్​పై ప్రజల్లో మరింత గౌరవం పెరిగింది. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం వల్ల అతడిని నెగటివ్​ రోల్స్​లో ప్రేక్షకులు చూడలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఇకపై తాను విలన్​ పాత్రలు చేయనని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు సోనూ. "ప్రస్తుతం నాకు మంచి పాత్రలే వస్తున్నాయి. ఏడాదికి కనీసం రెండు సినిమాల్లో చేయాల్సిన సమయం నాకుంది" అని ఆయన​ తెలిపారు.

లీడ్​రోల్​లో సోనూ!

బాలీవుడ్​ వర్గాల సమాచారం మేరకు.. బంగాల్​లో మోటార్​ బైక్​పై రోగులను ఆస్పత్రికి తీసుకువెళ్లే కరీముల్​ హక్​ జీవితాధారంగా 'బైక్ అంబులెన్స్​ దాదా' రూపొందించనున్నారు. ఇందులో టైటిల్​ రోల్​లో సోనూ నటించే అవకాశం ఉంది.

ఈ-రిక్షాల పంపిణీ

కరోనా సంక్షోభంలో ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు నటుడు సోనూసూద్​ ఇటీవలే ఓ సరికొత్త ప్రణాళికలను రూపొందించారు. అవసరమైన వారికి ఈ-రిక్షాలను అందించి వారితో కొత్త వ్యాపారం చేసేలా సోనూ ప్రోత్సహిస్తున్నారు.

'ఖుద్ కమావో ఘర్ చలావో' పేరుతో ఓ విన్నూత్న కార్యక్రమాన్ని చేపట్టిన నటుడు సోనూసూద్​.. ప్రజలకు ఉపాధి అవకాశమే కల్పించడమే లక్ష్యంగా పేర్కొన్నారు. "అవసరమైన సామాగ్రిని అందించడం కంటే ఉద్యోగ అవకాశాలను అందించడం చాలా ముఖ్యమని నమ్ముతున్నా. ఈ ప్రయత్నం ద్వారా ప్రజలు వారి కాళ్లపై వారు నిలబడడానికి అది సహాయపడుతుందని భావిస్తున్నా" అని సోనూసూద్​ అన్నారు.

ఉద్యోగం కోసం ప్రత్యేక యాప్​

కరోనా సంక్షోభంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ఇదివరకే 'ప్రవాసీ రోజ్​ఘర్​' అనే యాప్​ను సోనూసూద్​ ప్రారంభించారు. దీని ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. వారిలో నైపుణ్యాలను వృద్ధి చేయడం సహా ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు సోనూ ప్రకటించారు.

ఇదీ చూడండి:అభిమాని 'లీఫ్​ ఆర్ట్​'కు సోనూ సర్​ప్రైజ్​

ABOUT THE AUTHOR

...view details