బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ ఖాన్(kareena kapoor).. సైఫ్ అలీ ఖాన్(saif ali khan)ను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఇటీవలే మాతృత్వం గురించి తన అనుభవాలను పంచుకుంటూ ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. 'ప్రెగ్నెన్సీ బైబిల్'(pregnancy bible) అనే టైటిల్‌తో రిలీజ్ అయిన ఈ బుక్‌లో ఇద్దరు పిల్లలకు తల్లి కావడం గురించి, తాను ఎదుర్కొన్న కష్టాలను గురించి వివరించింది. ఈ నేపథ్యంలో తైమూర్ జన్మించిన సమయంలో తాను పరిపూర్ణ తల్లిగా లేనని వెల్లడించింది.
"మొదటి సంతానం సమయంలో నేను పరిపూర్ణ తల్లినని భావించలేదు. ప్రారంభంలో తైమూర్‌కు డైపర్ తొడగడం కూడా సరిగా రాలేదు. కొన్నిసార్లు దాని ద్వారా మలం లీక్ అయ్యేది. ఆ సమయంలో అతడు 'తన తల్లికి డైపర్ కూడా సరిగా తొడగటం రాదు' అనుకుని ఉంటాడు! ఓ తల్లిగా మిగతా తల్లులకు ఇచ్చే సలహా ఒక్కటే. ఇది మీ సౌలభ్యం, పని తీరు గురించి. మీకైదేతే సరిగా అనిపిస్తుందో అదే చేయండి. మీరెంత గొప్పగా పని చేస్తే మీ తనయుడు అంత సౌకర్యంగా ఉంటాడు. అందుకే ఈ విషయాన్ని చాలా త్వరగా నేర్చుకున్నా."