తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వైరల్​: 'అవును నేను డ్రగ్స్​కు బానిసను'

నటి కంగనా రనౌత్​ డ్రగ్స్​కు బానిసైనట్లు ఇటీవలే అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. అందులో తాను ఒకప్పుడు మత్తుపదార్థాలు సేవించినట్లు కంగన స్వయంగా చెప్పింది.

Kangana
కంగన

By

Published : Sep 11, 2020, 3:36 PM IST

బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ మాదక ద్రవ్యాలు తీసుకుందంటూ ఇటీవలే ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో ఈ విషయంపై కంగన మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో.. తాను డ్రగ్స్​కు బానిసైనట్లు కంగన అందులో పేర్కొంది.

కంగనా రనౌత్​

కంగన 16 ఏళ్ల వయసున్నప్పుడు నటి కావాలన్న ఆకాంక్షతో ముంబయి చేరుకుంది. చాలా తక్కువ సమయంలోనే అనేక ఒడుదొడుకులను తట్టుకుని బాలీవుడ్​ స్టార్​ అయింది. అయితే, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంత మంది తనకు సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామని నమ్మించి మత్తు పదార్థాలకు బానిస చేసినట్లు కంగన ఆరోపించింది.

సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మృతి కేసులో మాదక ద్రవ్యాల కోణం బయటపడిన నేపథ్యంలో.. చిత్ర పరిశ్రమలో డ్రగ్స్​ వినియోగంపైనా స్పందించింది కంగన. నటులు రణ్​వీర్​ సింగ్​, రణ్​బీర్​ కపూర్​, విక్కీ కౌషల్​, దర్శకుడు అయాన్​ ముఖర్జీలను డ్రగ్​ టెస్టులు చేయించుకోవాలని సూచించింది.

ABOUT THE AUTHOR

...view details