"చిత్ర పరిశ్రమలోనే కాదు.. ఏ రంగంలోనైనా సరే చక్కటి ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఉన్నప్పుడే మనల్ని మనం సరికొత్తగా నిరూపించుకోగలుగుతాం" అంటోంది నభా నటేష్. 'నన్ను దోచుకుందువటే' చిత్రంతో సినీప్రియుల మదిని గెలుచుకున్న నభా.. 'ఇస్మార్ట్ శంకర్'తో మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత రవితేజతో 'డిస్కోరాజా'లో ఆడిపాడింది. ప్రస్తుతం ఈ భామ 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రంలో నటిస్తోంది.
'వాళ్ల కంటే బాగా నటించాలి అనుకుంటా' - నభా నటేష్ కొత్త సినిమా అప్డేట్
పోటీ వాతావరణాన్ని తాను ఎప్పుడూ ఇష్టపడతానని చెబుతోంది నటి నభా నటేష్. ఏ రంగంలోనైనా ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్నప్పుడే మనల్ని మనం సరికొత్తగా నిరూపించుకోగలుగుతామని వెల్లడించింది.

సినీ పరిశ్రమలో నాయికల మధ్య పోటీ వాతావరణం ఎలా ఉంటుంది? దాని వల్ల ఒత్తిడికి గురవుతుంటారా?
నభా నటేష్:పోటీ ఉన్నప్పడే కదా.. మనల్ని మనం మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం దొరికేది. పరిశ్రమలో నాయికల మధ్యనే అని కాదు ప్రతి నటీనటులకీ మధ్య పోటీ ఉండటం సహజమే. ఒకరకంగా ఈ వాతావరణం వల్ల మనం అవతల వారి నుంచి మరిన్ని కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. నా తొలి చిత్రం నుంచి ఇప్పటి వరకు నేను వేరే హీరోయిన్స్ సినిమాలు చూసి నేర్చుకున్న విషయాలు చాలా ఉన్నాయి. తెరపై వాళ్ల నటనను చూస్తున్నప్పుడు నేను వాళ్లకంటే బాగా నటించాలి అని అనుకుంటా.