2017లో ప్రపంచసుందరిగా నిలిచిన మానుషీ చిల్లర్... 'పృథ్వీరాజ్' సినిమాలో సన్యోగితా పాత్రతో తెరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. అయితే తాజాగా తాను చిత్రాల్లో ఎలాంటి పాత్రలు పోషించాలనుకుంటుందో తెలిపింది ముద్దుగుమ్మ.
భారతీయ మహిళా సంప్రదాయ, కట్టుబాట్లు తెలిపే పాత్రలు పోషించాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఓ భారతీయ మహిళ ప్రదర్శించే ముందుచూపు, మాటతీరు, స్వతంత్రత భావాన్ని ఉట్టిపడే పాత్రలు చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
"పృథ్వీరాజ్ సినిమాలో అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నాను. శాయశక్తులా శ్రమించి నా పాత్రకు పూర్తి న్యాయం చేస్తాను. నా సినిమా విడుదలైనప్పుడు... ప్రేక్షకుల నుంచి వారి అభినందనలు పొందాలని ఆశిస్తున్నాను. భవిష్యత్తులో భారతీయ మహిళా సుగుణాలు ఉట్టిపడే పాత్రలు చేయాలనుకుంటున్నాను. "