తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'జాన్వీ, ఇషాన్​ది ప్రేమ కాదు..స్నేహమే'

బాలీవుడ్​లో యువ హిట్ పెయిర్​గా పేరు తెచ్చుకున్న జాన్వీ కపూర్, ఇషాన్ ఖత్తర్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై జాన్వీ తండ్రి బోనీ కపూర్ స్పందిస్తూ వారిద్దరూ స్నేహితులని స్పష్టం చేశాడు.

బోనీ

By

Published : Jul 30, 2019, 2:29 PM IST

శ్రీదేవి, బోనీ కపూర్‌ల పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌, నటుడు ఇషాన్‌ ఖత్తర్‌తో ప్రేమలో ఉన్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కలిసి 'ధడక్‌' సినిమాలో నటించారు. ఇదే జాన్వీ తొలి సినిమా. ఈ సమయంలో వీరి మధ్య ఏర్పడ్డ స్నేహం తర్వాత ప్రేమగా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. జాన్వీ, ఇషాన్‌ ఫంక్షన్లు, డిన్నర్లకు కలిసి వెళ్తూ.. మీడియా కంటపడటం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది.

జాన్వీ ప్రేమలో ఉన్నట్లు వచ్చిన వార్తలపై బోనీ కపూర్ స్పందించాడు. ఇవన్నీ కల్పితాలని స్పష్టం చేశాడు. "అవును.. ఇషాన్‌, జాన్వీ కలిసి సినిమాలో నటించారు. అందుకే స్నేహితులు అయ్యారు. నాకు నా కుమార్తెపై గౌరవం ఉంది. ఇషాన్‌తో తన స్నేహాన్ని కూడా నేను గౌరవిస్తాను" అని స్పష్టం చేశాడు.

జోన్వీ, ఇషాన్

ఇవీ చూడండి.. 'నీ కన్నులు అలిసేలా నీకు కనిపిస్తా'

ABOUT THE AUTHOR

...view details