హిందీ చలన చిత్ర పరిశ్రమకు వచ్చిన తొలి రోజుల్లో సినిమాల్లో నిలదొక్కుకునేందుకు చాలా కష్టపడ్డాను అని బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నటనలో శిక్షణ తీసుకొని ముంబయికి వచ్చానన్నారు.
"ప్రతి రోజు ఉదయం, బయోడేటా, ఫొటోలు పట్టుకొని ఎన్నో కార్యాలయాల చుట్టూ తిరిగే వాడిని. రాత్రికి చాలా అలసిపోయి ఇంటికి చేరుకొని ప్రశాంతంగా నిద్రించేవాడిని. బుల్లితెరలో నటించేందుకు కూడా ప్రయత్నించాను. కానీ, ఎటువంటి పాత్రలు రాలేదు. సినిమాల్లో ఒకటి, రెండు నిమిషాలు నటించే అవకాశం లభించినా సరే దాన్ని వదులుకోలేదు. ఏదో ఒక రోజు నేను ఓ పెద్ద స్టార్ కావాలని ఎన్నడూ కూడా అలోచించలేదు. నాకు తెలిసింది నటన మాత్రమే. దాని కోసమే కష్టపడ్డాను."