తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Raj Kundra: 'అతడు తప్పుడు పనులు చేయిస్తాడనుకోలేదు' - బాలీవుడ్​ నటి షెర్లిన్​ చోప్రా

రాజ్‌కుంద్రాపై బాలీవుడ్​ నటి షెర్లిన్​ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. కుంద్రా.. తనతో తప్పుడు పనులు చేయిస్తాడనుకోలేదన్నారు. ఆయన చెప్పిన మాటలు నమ్మి చివరికి మోసపోయానని షెర్లిన్ కన్నీటిపర్యంతం అయ్యారు. కుంద్రా కేసులో షెర్లిన్‌ను తాజాగా ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు విచారించారు.

sherlin chopra
షెర్లిన్​ చోప్రా

By

Published : Aug 7, 2021, 3:39 PM IST

శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అసభ్యకరమైన పనులు చేయిస్తాడనుకోలేదని నటి షెర్లిన్‌చోప్రా తెలిపారు. కుంద్రా కేసులో షెర్లిన్‌ను తాజాగా ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు విచారించారు. 8 గంటలపాటు జరిగిన సుదీర్ఘ విచారణలో రాజ్‌కుంద్రా ప్రొడక్షన్‌ హౌస్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. విచారణ అనంతరం ఓ జాతీయ మీడియాకు షెర్లిన్‌ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. కుంద్రా అబద్ధాలు చెప్పి మభ్యపెట్టాడని ఆరోపించారు. అశ్లీల చిత్రాలు సర్వసాధారణమేనని ఆయన చెప్పాడని షెర్లిన్‌ వివరించారు.

బాలీవుడ్ నటి షెర్లిన్​ చోప్రా

మాటలు నమ్మి మోసపోయా..

'మొత్తం వ్యవహారం గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఇలాంటి కేసులో భాగమవుతానని ఎప్పుడూ అనుకోలేదు. రాజ్‌కుంద్రాని మొదటిసారి కలిసినప్పుడు నా జీవితం మారిపోతుందని భావించా. కెరీర్‌లో బ్రేక్‌ లభిస్తుందనుకున్నా. శిల్పాశెట్టి భర్త నాతో ఇలాంటి తప్పుడు వ్యవహారాలు చేపిస్తాడనుకోలేదు. ఆర్మ్స్​ ప్రైమ్‌తో ఒప్పందం కుదరటంతో మొదట గ్లామర్‌ వీడియోలు చేశాం. ఆ తర్వాత బోల్డ్‌ సినిమాలు.

భార్య శిల్పాశెట్టితో రాజ్​కుంద్రా

గ్లామర్‌ వీడియోల్లో అశ్లీల చిత్రాలు కూడా భాగమేనని నమ్మించాడు. నగ్న చిత్రాలనేవి సర్వసాధారణమన్నట్లు చెప్పేవాడు. అంతేకాకుండా, నా వీడియోలు, ఫొటోలు శిల్పాకు బాగా నచ్చాయని అబద్ధాలు చెప్పాడు. ఆయన చెప్పిన మాటలు నమ్మి చివరికి మోసపోయాను.' అని షెర్లిన్‌ కన్నీటి పర్యంతమయ్యారు.

ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ స్వార్థపరులేనని.. డబ్బు కోసం ఎదుటివాళ్లను ఇబ్బందులపాలు చేస్తారని షెర్లిన్ తెలిపారు. భవిష్యత్తులో నా పిల్లల్ని ఈ పరిశ్రమలోకి పంపించనన్నారు.

ఇవీ చదవండి:

పోర్నోగ్రఫీ కేసు: పోలీసుల ముందుకు నటి షెర్లిన్ చోప్రా

పోర్నోగ్రఫీ కేసు: కుంద్రా పిటిషన్​ కొట్టివేత

Raj Kundra: కుంద్రా.. అశ్లీల కథాచిత్రమ్‌!

ABOUT THE AUTHOR

...view details