ప్రతిష్ఠాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు(dada saheb phalke award 2021 winner) తనను వరించడం పట్ల సూపర్‌స్టార్ రజనీకాంత్(superstar rajinikanth movie) మరోసారి ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం దిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ విషయమై ఆదివారం ట్వీట్ చేశారు. అసలు ఈ అవార్డు దక్కించుకుంటానని అనుకోలేదని అన్నారు. తన మెంటార్, దర్శకుడు కె.బాల చందర్ ఈ సమయంలో మన మధ్య లేకపోవడం చాలా బాధగా ఉందని చెప్పారు.
"దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు(dadasaheb phalke award 2021) అందుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. నేను ఇది దక్కించుకుంటానని అసలు ఊహించలేదు. కేబీ సర్‌ను(డైరెక్టర్ కె.బాలచందర్) మిస్సవుతున్నాను. నేను అవార్డు తీసుకోవడం చూసేందుకు, ఆయన లేరనే విషయం నాకు చాలా బాధగా ఉంది" అని రజినీకాంత్ అన్నారు.