తనకు శ్రీదేవి కంటే పవన్‌కల్యాణ్ అంటేనే ఎక్కువ ఇష్టమన్నాడు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే వర్మ.. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ప్రీ న్యూయర్ ప్రైవేట్ పార్టీలో చాలా హంగామానే చేశాడు. హీరోయిన్ నైనా గంగూలీ కాళ్లపై పడ్డాడు. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇదే కాకుండా ఈ పార్టీలో మాట్లాడుతూ పవన్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు.
"పవన్‌కల్యాణ్‌కు కొంచెం తిక్కుంది. నాక్కొంచెం లెక్కుంది. లెక్క కంటే తిక్కే ఎక్కువ మందికి ఇష్టముంటుంది. కాబట్టే ఆయనే సూపర్‌స్టార్. నాకు శ్రీదేవి కంటే పవన్ అంటేనే ఎక్కువ ఇష్టం" -రామ్‌గోపాల్ వర్మ, దర్శకుడు