తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సినిమా ఛాన్స్​ల కోసం ఎవర్నీ వాడుకోలేదు' - దియా మీర్జా వార్తలు

నటిగా ఎదగడానికి తన స్నేహాలను ఎప్పుడూ వాడుకోలేదని అన్నారు బాలీవుడ్​ నటి దియా మీర్జా. సినిమాల్లో అవకాశాలు రానప్పుడు ఎంతో అసహనానికి గురయ్యానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

I have never used friendships to demand a role in a film, Says Dia Mirza
'సినిమా ఛాన్స్​ల కోసం ఎవర్ని వాడుకోలేదు'

By

Published : Jan 3, 2021, 11:09 AM IST

సినిమాల్లో అవకాశాల కోసం తన స్నేహాలను ఎప్పుడూ వాడుకోలేదని బాలీవుడ్‌ నటి దియా మీర్జా అన్నారు. అంతేకాకుండా అవకాశాల్లేక తాను ఎంత అసహనానికి గురయ్యానో కేవలం తన స్నేహితులకు మాత్రమే తెలుసని ఆమె తెలిపారు. తాజాగా ఆమె ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌ గురించి ఈ విధంగా స్పందించారు.

దియా మీర్జా

"ఎన్నో ఏళ్ల నుంచి నేను సినీ పరిశ్రమలో కొనసాగుతున్నా. అందువల్ల నాకు ఇండస్ట్రీలో స్నేహితులు ఎక్కువ. నాలాంటి అభిరుచులు ఉన్న తోటి నటీనటులు, పలువురు ప్రముఖులు నాకు స్నేహితులయ్యారు. అయితే ఏదైనా సినిమాలో ఆఫర్స్‌ పొందడం కోసం ఈ స్నేహ బంధాలను నేను ఎప్పుడూ వాడుకోలేదు. నటిగా సరైన అవకాశాల్లేక కొన్ని సందర్భాల్లో నేను ఎంతటి తీవ్ర అసహనానికి గురయ్యానో కేవలం నా స్నేహితులకు మాత్రమే తెలుసు. అలాగే, కెరీర్‌పరంగా 'సంజు', 'తప్పడ్‌' చిత్రాలు నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి" అని దియా మీర్జా తెలిపారు

ఇదీ చూడండి:టాలీవుడ్.. పాన్ఇండియా కేరాఫ్ అడ్రస్!

ABOUT THE AUTHOR

...view details