తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ పాత్రను నేనెంతో ఆస్వాదించా: తమన్నా - tamannah sitimar movie

సంపత్​ నంది దర్శకత్వంలో గోపీచంద్​ హీరోగా 'సీటీమార్'​ సినిమా రాబోతుంది. ఈ చిత్రంలో మహిళా కబడ్డీ కోచ్​ జ్వాలా రెడ్డి పాత్రలో హీరోయిన్​ తమన్నా కనిపించనుంది. తాజాగా దీనిపై స్పందించిన ఆమె.. ఈ పాత్రను తాను ఎంతో ఆస్వాదించినట్లు తెలిపింది.

tamannah
తమన్నా

By

Published : Mar 20, 2021, 7:31 AM IST

కథలో కొత్తదనం ఉండి చేసే పాత్రలో వైవిధ్యత ఉందంటే చాలు నాయికలు ఎలాంటి ప్రయోగానికైనా వెనకాడటం లేదు. సాయిపల్లవి, రష్మిక లాంటి నాయికలంతా ఇప్పుడలాంటి ప్రయోగాలే చేస్తున్నారు. తెలుగులో సొంత గళం వినిపించడమే కాక.. పాత్రను బట్టీ ప్రత్యేక యాసల్లోనూ చిలకపలుకులు పలికేస్తూ మురిపిస్తున్నారు. ఈ జాబితాలో తమన్నా ఎప్పుడో చేరిపోయింది. ఇటీవల కాలంలో ఆమె నుంచి వచ్చిన ప్రతి తెలుగు చిత్రంలోనూ సొంత స్వరమే వినిపించింది. ఇప్పుడామె మరో అడుగు ముందుకేసి 'సీటీమార్‌' సినిమా కోసం తొలిసారి తెలంగాణ యాసలో సంభాషణలు పలికింది.

తాజాగా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ కార్యక్రమాల్ని పూర్తి చేసింది తమన్నా. గోపీచంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. సంపత్‌ నంది దర్శకుడు. కబడ్డీ ఆట నేపథ్యంగా సాగే కథతో రూపొందుతోంది. ఇందులో తమన్నా తెలంగాణ మహిళా కబడ్డీ కోచ్‌ జ్వాలా రెడ్డి పాత్రలో సందడి చేయబోతుంది. దీనిపై తమన్నా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ "నన్ను నమ్మి జ్వాలారెడ్డి పాత్ర ఇచ్చినందుకు సంపత్‌కి థ్యాంక్స్‌. ఈ చిత్రంలో తెలంగాణ యాసను ప్రయత్నించా. డబ్బింగ్‌ పూర్తయింది. ఈ పాత్రని నేనెంతో ఆస్వాదించా" అని రాసుకొచ్చింది. ఆమె చెప్పిన సంభాషణలు తెరపై ఎలా పేలుతాయో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఇదీ చూడండి: బర్త్​ డే స్పెషల్: తమన్నా గురించి ఈ విషయాలు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details