తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరో అక్షయ్ కుమార్.. రోజుకో గ్లాస్ గోమూత్రం - అక్షయ్ కుమార్ మ్యాన్ వర్సెస్ వైల్డ్

తాను ప్రతిరోజు గోమూత్రం తాగుతానని అన్నారు కథానాయకుడు అక్షయ్ కుమార్. ఆయుర్వేద వైద్యంలో భాగంగా ఇలా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

I drink cow urine every day, says Akshay Kumar
Akshay Kumar

By

Published : Sep 11, 2020, 11:31 AM IST

బాలీవుడ్​ అగ్రహీరో అక్షయ్ కుమార్ ఆశ్చర్యకర విషయం చెప్పారు. ప్రతిరోజు ఆవు మూత్రం తాగుతానని వెల్లడించారు. సాహస యాత్రికుడు బేర్​గ్రిల్స్​తో లైవ్​లో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.

'ఇన్​టూ ది వైల్డ్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, సూపర్​స్టార్ రజనీకాంత్ తర్వాత బేర్ గ్రిల్స్​తో కలిసి అడవిలో సాహసాలు చేశారు అక్షయ్. ఆ ఎపిసోడ్ నేడు(సెప్టెంబరు 11) ప్రసారం కానుంది. ఈ సందర్భంగా బేర్​గ్రిల్స్​తో కలిసి గురువారం లైవ్​ చాట్​ నిర్వహించారు. అక్షయ్​తో పాటు హీరోయిన్లు హ్యుమా ఖురేషి, లారా దత్తా పాల్గొన్నారు. ప్రస్తుతం 'బెల్ బాటమ్' షూటింగ్​ కోసం వీరందరూ స్కాట్లాండ్​లో ఉన్నారు.

"మ్యాన్​ వర్సెస్ వైల్డ్ షోలో భాగంగా ఏనుగు మలంతో చేసిన సూప్ ఎలా తాగారు?​" అని హ్యుమా అక్షయ్​ను అడగ్గా.. "అది నాకు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే ఆయుర్వేద వైద్యం నిమిత్తం, ప్రతిరోజు నేను గోమూత్రం తాగుతాను" అని చెప్పారు.

ఇదే ఇంటర్వ్యూలో అక్షయ్​తో తనకు ఎదురైన అనుభవాల్ని పంచుకున్నారు బేర్​గ్రిల్స్. ఎలాంటి భేషజాలు లేని వ్యక్తి అతడని అన్నారు. ఇప్పటివరకు తన షోకు వచ్చిన వారిలో ఫిట్​నెస్ పరంగా అక్షయ్ టాప్​లో ఉంటాడని చెప్పారు.

బాలీవుడ్​ హీరో అక్షయ్ కుమార్

ABOUT THE AUTHOR

...view details