తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ విషయాన్ని నేను మర్చిపోయాను: ఛార్మి - puri jagannadh charmi kaur

తనకు నటిగా అవకాశాలు వస్తున్నాయని, కానీ వాటిపై పెద్దగా ఆసక్తి లేదని నిర్మాత ఛార్మి(charmi kaur movie list) చెప్పింది. భవిష్యత్తులోనూ నటించకపోవచ్చని తెలిపింది.

Charmee
ఛార్మి

By

Published : Oct 24, 2021, 11:28 AM IST

నటి నుంచి నిర్మాతగా మారిన ఛార్మి(charmi kaur movie list).. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో 'లైగర్' సినిమా రూపొందిస్తోంది. పూరీ జగన్నాథ్​ కలిసి సంయుక్తంగా నిర్మిస్తోంది. చివరగా 'జ్యోతిలక్ష్మి'లో కనిపించిన ఈమె(charmi kaur wedding).. అప్పటినుంచి నటనకు దూరమైంది. మళ్లీ సినిమాల్లో నటిస్తారా అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చిందీ భామ.

ఛార్మి

"నిర్మాతగా ప్రస్తుతం బిజీగా ఉన్నాను. నేను నటి అనే విషయాన్ని దాదాపు మర్చిపోయాను. కానీ ఇండస్ట్రీ మాత్రం గుర్తుపెట్టుకుంది. అప్పుడప్పుడూ నాకు యాక్టింగ్ ఛాన్స్​లు వస్తూనే ఉన్నాయి. కానీ వాటిపై నాకు అంతగా ఆసక్తిలేదు. భవిష్యత్తులో నటించకపోవచ్చు" అని ఛార్మి(charmi kaur age) చెప్పింది.

2002లో వచ్చిన 'నీ తోడు కావాలి' సినిమాతో పరిచయమైన ఛార్మి(puri jagannadh charmi kaur).. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. దక్షిణాదిలో పలువురు స్టార్ హీరోలతో పాటు హిందీ అమితాబ్ బచ్చన్​తోనూ కలిసి నటించింది.

ఛార్మి పూరీ జగన్నాథ్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details