గాసిప్స్ కోసం తన పేరును వాడడం కొంత బాధగా అనిపించిందని నటుడు నాగచైతన్య అన్నారు(love story naga chaitanya movie release date). 'లవ్‌స్టోరీ' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన(naga chaitanya love story movie images) తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ప్రతి ఒక్కరికీ వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలు ఉంటాయని అన్నారు. ఆ రెండింటినీ తాను వేర్వేరుగానే చూస్తానని తెలిపారు.
"నటుడిగా కెరీర్ ప్రారంభించిన సమయంలోనే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌ను వేర్వేరుగా చూడడం నేర్చుకున్నా. ఆ రెండింటినీ కలిపి చూడను. ఈ విషయాన్ని మా తల్లిదండ్రుల నుంచి తెలుసుకొన్నాను. షూటింగ్స్ లేదా ఇతర బిజినెస్ వర్క్స్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్లిద్దరూ ఆ విషయాల గురించి చర్చించుకోరు. అదే మాదిరిగా పనిలో రాగానే పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించరు"