తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'క్రికెట్ చూడను.. కానీ సచిన్, కోహ్లీ అంటే గౌరవం' - URVASHI RAUTEL kohli

తాను క్రికెట్​ను ఎక్కువగా వీక్షించనని అంటోంది బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా. కానీ సచిన్, కోహ్లీ అంటే అమితమైన గౌరవమని వెల్లడించింది.

Urvashi Rautel
ఊర్వశి

By

Published : Apr 2, 2021, 8:05 AM IST

బాలీవుడ్‌ నటీమణి ఊర్వశి రౌతేలా ఎక్కువగా క్రికెట్‌ను వీక్షించనని అంటోంది. కాబట్టి తనకు క్రికెటర్ల గురించి పెద్దగా తెలియదని చెబుతోంది. అయితే సచిన్‌, విరాట్‌ కోహ్లీ అంటే మాత్రం అమితమైన గౌరవం అని తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె జవాబులిచ్చింది.

ఏడాది క్రితం టీమ్‌ఇండియా క్రికెటర్‌ రిషభ్ పంత్‌తో కలిసి ఊర్వశి భోజనం చేస్తున్న చిత్రాలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. బహుశా ఆమె పంత్‌ ప్రియురాలేమోనని గుసగుసలు వచ్చాయి. వాట్సాప్‌లో పంత్‌ ఆమెను బ్లాక్ చేసినట్టూ వార్తలు షికార్లు చేశాయి.

ఈ నేపథ్యంలో 'మీకు ఇష్టమైన క్రికెటర్‌ ఎవరు?' అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఊర్విశి ఇలా సమాధానం గమనార్హం. "నేను క్రికెట్‌ అసలు చూడను. కాబట్టి నాకు క్రికెటర్ల గురించి ఏమీ తెలియదు. సచిన్‌ సర్‌, విరాట్‌ సర్‌ అంటే మాత్రం అమిత గౌరవం" అని జవాబిచ్చింది.

ఊర్వశి ఇన్​స్టా స్టోరీ

ABOUT THE AUTHOR

...view details