తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ప్రస్తుతం నేను ఏ సినిమా చేయడం లేదు' - Pooja Hegde in Aruva movie

ప్రస్తుతం తాను ఏ తమిళ సినిమాకు ఒప్పుకోలేదని స్పష్టం చేసింది హీరోయిన్ పూజా హెగ్డే. ఇప్పుడే అభిమానులు ఓ నిర్ణయానికి వెళ్లకండంటూ తెలిపింది.

పూజ
పూజ

By

Published : Apr 1, 2020, 6:10 PM IST

ప్రస్తుతానికి తాను ఎలాంటి తమిళ సినిమాలో నటించడం లేదని నటి పూజాహెగ్డే స్పష్టం చేసింది. ఈ హీరోయిన్ త్వరలోనే సూర్య కథానాయకుడిగా తెరకెక్కుతోన్న 'అరువా' చిత్రంలో నటించనుందంటూ కొన్నిరోజుల నుంచి సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పూజ ట్విట్టర్‌ వేదికగా స్పందించింది.

"ప్రస్తుతం నేను తమిళ సినిమాలో నటిస్తున్నాననే విషయంలో మీరు ఒక నిర్ణయానికి వెళ్లకండి. ఇప్పటిదాకా నేను ఎలాంటి తమిళ సినిమాకు సంతకం చేయలేదు. కథలు వింటున్నాను. అన్ని సవ్యంగా జరిగితే కచ్చితంగా ఈ ఏడాది ఓ తమిళ సినిమా చేయాలని భావిస్తున్నా. థ్యాంక్యూ"

-పూజా హెగ్డే, హీరోయిన్

ఈ ఏడాది విడుదలైన 'అల.. వైకుంఠపురములో' చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన నటించింది పూజాహెగ్డే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రంతో ఓ సూపర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌ కథానాయకుడిగా ఎస్‌.రాధాకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details