తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అమ్మలా నేను చేయలేను: జాన్వీ - శ్రీదేవి

దివంగత నటి శ్రీదేవిలా తాను నటించలేనంటోంది ఆమె కుమార్తె జాన్వీ కపూర్​. శ్రీదేవి నటించిన సినిమాలను రీమేక్​ చేసే సాహసం చేయబోనని స్పష్టం చేసింది.

I can't act like My Mother sridevi: Janvi Kapoor
అమ్మలా నేను చేయలేను: జన్వీ కపూర్​

By

Published : Mar 5, 2020, 7:02 PM IST

'ధఢక్‌' చిత్రంతో సినీ రంగప్రవేశం చేసింది నటి జాన్వీ కపూర్‌. దివంగత నటి శ్రీదేవి కూతురిగా పరిచయమైన ఈ భామంటే అందరికీ అభిమానమే. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అమ్మ గురించి ప్రస్తావించింది.

"సినిమా వారసులకు వెండితెర ప్రవేశం అందరి కంటే చాలా సులువుగానే జరగవచ్చు. కానీ ఆ తర్వాత మనం మనల్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. లేదంటే ఇంటిబాట పట్టాల్సిందే. కొంత మంది నన్ను అడుగుతున్నట్టు అమ్మలా నటించడం నాకు సాధ్యమయ్యే పనికాదు. ఆమెలా నటించాలంటే నాకు ఈ జన్మ సరిపోదు. నా చిత్రాల్లో నాలా మాత్రమే నటిస్తాను. ఆమెలా ఎప్పటికీ నటించలేను. అమ్మ చేసిన కొన్ని చిత్రాలను, రీమేక్, రీమిక్స్‌ చేయడం అంటే సాహసమే. వాటిని మళ్లీ తీయకపోవడమే ఉత్తమం."

- జాన్వీ కపూర్​, కథానాయిక

ప్రస్తుతం జాన్వీ, శరణ్‌ శర్మ దర్శకత్వంలో 'గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌' అనే చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్‌ హీరో కార్తిక్‌ ఆర్యన్‌తో కలిసి 'దోస్తానా 2'లోనూ చేస్తోంది.

ఇదీ చూడండి.. టాలీవుడ్​ 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌'కు గాయం!

ABOUT THE AUTHOR

...view details