తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సెల్ఫీలు అడుగుతుంటే నరకంలా అనిపిస్తోంది' - James bond Actor Craig had felt with selfies

తమ అభిమాన హీరోలు కనిపిస్తే చాలు.. సార్, ఆటోగ్రాఫ్​ ప్లీజ్​! అనేవారు ఒకప్పుడు. ఇప్పడు సోషల్ మీడియా వల్ల అందరూ సెల్ఫీల మాయలో పడ్డారు. అభిమాన నటులు కనిపించగానే సెల్ఫీలు దిగేందుకు పోటీపడుతున్నారు. అయితే ఇవి తనను తెగ ఇబ్బంది పెడుతున్నాయన్నాడు జేమ్స్​ బాండ్​ పాత్రధారి క్రెయిగ్​.

James bond actor craig
ఈ సెల్ఫీల వల్ల బతకలేకపోతున్నా: బాండ్​

By

Published : Mar 29, 2020, 5:37 PM IST

చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. అలా నడుచుకుంటూ వెళుతుండగా ఓ సినిమా హీరో మీకు కనబడితే ఏం చేస్తారు. మనలో చాలా మంది సెల్ఫీ అంటూ వారిని అడుగుతారు. కొందరు అనుమతి లేకుండా తీసుకుంటారు. అయితే అలాంటి వాటివల్ల తను నరకం అనుభవిస్తున్నానని అన్నాడు బాండ్ చిత్రాలతో గుర్తింపు పొందిన డేనియల్ క్రెయిగ్. ఈ విషయంలో తాను అనుభవిస్తున్న కష్టాలను ఏకరువు పెట్టాడు.

"నాకు రాత్రి పూట సరదాగా పబ్​కు వెళ్లడం అలవాటు. అక్కడ సన్నిహితులతో ప్రశాంతంగా ఉండాలని అనుకుంటాను. కానీ అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. సెల్‌ఫోన్లు రావడం వల్లే పరిస్థితి ఇలా తయారైంది. పగలంతా ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడానికి, ఫొటోలకు పోజులివ్వడానికి నాకు అభ్యంతరం లేదు. రాత్రి కూడా సెల్ఫీలు అడుగుతుంటే నరకంలా అనిపిస్తుంది"

- డేనియల్​ క్రెయిగ్, 'జేమ్స్ బాండ్' హీరో​

అనుమతి లేకుండా తారల ఫొటోలు తీసేవారి గురించి ప్రస్తావించిన క్రెయిగ్​.. ప్రస్తుతం చాలా మంది దగ్గరా కెమెరా ఉండటం వల్ల తాను ఓ సాధారణ మనిషిలా బతకలేకపోతున్నానని​ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి:'పుట్టినరోజు వేడుకలు వద్దు.. పెళ్లి వాయిదా వేస్తున్నా'

ABOUT THE AUTHOR

...view details