తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'విలన్​ అవ్వాలనే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టా' - కలర్​ ఫోటో వార్తలు

సుహాస్​, చాందిని హీరోహీరోయిన్లుగా, సునీల్​​ ప్రతినాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'కలర్​ ఫోటో'. 'ఆహా' ఓటీటీ ద్వారా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్​ వేడుకను చిత్రబృందం నిర్వహించింది.

I came to the film industry with the intention of acting as a villain: Sunil
'విలన్​ అవ్వాలనే చిత్రపరిశ్రమలో అడుగుపెట్టా'

By

Published : Oct 20, 2020, 6:46 AM IST

సుహాస్‌, చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రం 'కలర్‌ ఫోటో'. సందీప్‌ రాజ్‌ దర్శకుడు. సాయి రాజేశ్​ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాతలు. సునీల్‌ ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రం ఓటీటీ వేదిక 'ఆహా' ద్వారా ఈనెల 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో చిత్ర ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు. శివ నిర్వాణ, మారుతి, కృష్ణ చైతన్య, హను రాఘవపూడి అతిథులుగా హాజరయ్యారు.

సునీల్‌ మాట్లాడుతూ.. "విలన్‌ అవ్వాలనే పరిశ్రమకు వచ్చా. కానీ, హాస్యనటుడిగా, సహాయ నటుడిగా చాలా సినిమాలు చేశా. ఈ కథ వినగానే మారు మాట్లాడకుండా ఒప్పుకున్నా" అన్నారు.

'కలర్​ ఫోటో' ప్రీరిలీజ్​ ఈవెంట్​

"నన్ను నమ్మి, తన సొంత కథతో నన్ను దర్శకుడిగా పరిచయం చేసినందుకు సాయిరాజేశ్‌కి ఎప్పుడూ రుణపడి ఉంటా"నని అన్నారు దర్శకుడు సందీప్‌. "నటుడిగా ఉండటం తేలికే కానీ, హీరోగా ఉండటం ఎంత కష్టమో ఇప్పుడర్థమవుతుంది. ఎంతో నిజాయితీగా ఈ చిత్రం తీశామ"న్నారు సుహాస్‌.

నిర్మాత సాయిరాజేశ్‌ మాట్లాడుతూ.. "ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి మేం పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. దర్శకుడు సందీప్‌ చాలా కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు. సునీల్‌ మా చిత్రానికి ప్రధాన ఆకర్షణ. చిత్ర విడుదలకు సహకరించిన నిర్మాతలు అల్లు అరవింద్‌, బన్నీ వాసుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా" అన్నారు.

ABOUT THE AUTHOR

...view details