తెలంగాణ

telangana

By

Published : Dec 29, 2020, 9:23 PM IST

ETV Bharat / sitara

'టాలీవుడ్​లో నటుడిగా ఉన్నందుకు గర్వంగా ఉంది'

కష్టకాలంలో తన సినిమా విడుదలకు చిత్రపరిశ్రమ అంతా మద్దతుగా నిలిచిందని టాలీవుడ్​ యువ కథానాయకుడు సాయి ధరమ్​తేజ్​ అన్నారు. 'సోలో బ్రతుకే సో బెటర్​' చిత్ర విజయోత్సవ సమావేశంలో తేజ్​ మాట్లాడారు.

I am very proud to be an actor in Tollywood, Says Supeme Hero SaiTej
'టాలీవుడ్​లో నటుడిగా ఉన్నందుకు గర్వంగా ఉంది'

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా ఉన్నందుకు గర్వంగా ఉందని యువ కథానాయకుడు సాయి ధరమ్​ తేజ్ అన్నారు. కష్టకాలంలో పరిశ్రమ మొత్తం మద్దతుగా నిలిచి తన సినిమా విడుదలను ప్రోత్సహించిందని గుర్తుచేసుకున్న తేజ్​.. 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

'సోలో బ్రతుకే సో బెటర్​' చిత్ర విజయోత్సవ సమావేశంలో మాట్లాడుతున్న చిత్రబృందం

హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో సినిమా విజయోత్సవ సమావేశాన్ని నిర్వహించిన చిత్ర యూనిట్.. సినిమా గెలవడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా సినిమాల పునఃప్రారంభానికి 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా ఆదర్శంగా నిలిచిందన్నారు.

ఇదీ చూడండి:ప్రత్యేక గీతంలో మోనాల్.. 'అల్లుడు'తో డ్యాన్స్

ABOUT THE AUTHOR

...view details