Amirkhan daughter ira: చిత్రసీమ అంటేనే వారసత్వానికి చిరునామా. ఒకరు స్టార్‌గా నిలదొక్కుకుంటే చాలు.. వారి ఇంటి నుంచి వారసులు చాలా మంది తెరపైకి వస్తుంటారు. చివరకు ప్రతిభ ఆధారంగా సినీ రంగంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారు. ఆ విధంగానే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుందని కొద్ది రోజులుగా బాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐరా స్పందించింది.
ఇటీవలే ఐరా తన అభిమానులతో ఇన్స్టాగ్రామ్ లైవ్‌చాట్‌లో ముచ్చటించింది. మానసిక ఆరోగ్య సమస్యలపై పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఈ క్రమంలో ఓ సోషల్ మీడియా యూజర్.. నటిగా ఎప్పుడు ఎంట్రీ ఇవ్వనున్నారని అడిగారు. అందుకు సమాధానంగా ఐరా 'నేను నటిగా ఎంట్రీ ఇవ్వను' అని చెప్పింది.
అయితే ఐరా నటిగా కాకపోయినా దర్శకురాలిగా రాణించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే భారత క్రికెట్ ఆటగాడు యువరాజ్ సింగ్ భార్య హజీల్ కీచ్ నటించిన 'మేదియా' చిత్రానికి దర్శకత్వం వహించింది.