ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రేజ్ దక్షిణాదికి మాత్రమే పరిమితం కాలేదు. ఇంత వరకు బాలీవుడ్‌లో ఒక్క చిత్రం చేయకున్నా.. అతడికి ఉత్తరాదిలోనూ అక్కడి స్టార్ హీరోల స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. బాలీవుడ్ స్టార్ నాయికలైన ఆలియా భట్.. జాన్వీ కపూర్ విజయ్‌తో నటించే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే విజయ్‌కు బాలీవుడ్‌లో ఎవరితో ఆడిపాడాలనుందో తెలుసా? తాజాగా ఈ విషయాన్ని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టాడు రౌడీ.
జాన్వీ, కియారాతో రొమాన్స్ చేస్తా: విజయ్ - కియారా అద్వానీ
టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండతో కలిసి నటించాలన్న కోరికను ఇప్పటికే కొంతమంది హీరోయిన్లు బయటపెట్టారు. అయితే విజయ్ ఎవరితో రొమాన్స్ చేయాలనుకుంటున్నాడో అన్న విషయాన్ని తాజాగా ఈ హీరో వెల్లడించాడు.
"ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉన్న యువ కథానాయికల్లో ఎవరితో మీ తర్వాతి చిత్రం చేయాలనుకుంటున్నారు?" అని ప్రశ్నించగా.. "జాన్వీ కపూర్, కియారా అడ్వాణీలతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అని అన్నాడు. అయితే ప్రత్యేకంగా కొందరితోనే నటించాలన్న లక్ష్యాలేమీ పెట్టుకోలేదని, మంచి నటుడిగా గుర్తింపు పొందిన తర్వాత ప్రతి ఒక్కరితోనూ కలిసి నటించాలని తెలిపాడు. అంతేకాదు.. ఏ హీరోయిన్‌తో అయినా కలిసి పని చేసేందుకు సిద్ధమని తెలియజేశాడు. ప్రస్తుతం ఈ యువ హీరో బాలీవుడ్ భామ అనన్య పాండేతో కలిసి 'ఫైటర్'లో నటిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా ముస్తాబవుతోన్న ఈ చిత్రాన్ని.. దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నాడు.
ఇదీ చూడండి.. కరోనాతో బాలీవుడ్‌కు రూ.800 కోట్ల నష్టం