తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హైపర్​ ఆది 'పుష్ప' స్టెప్.. నవ్విస్తున్న రోజా పంచ్​లు - జబర్దస్త్​ లేటెస్ట్​ ప్రోమో

Jabardast latest promo: 'జబర్దస్త్'​ లేటెస్ట్​ ప్రోమో విడుదలై తెగ నవ్విస్తోంది. హైపర్​ఆది, చలాకీ చంటి, రాకెట్​ రాఘవ తమ స్కిట్​లతో కితకితలు పెట్టించారు. ఇక జడ్జి రోజా వేసిన పంచ్​లు కడుపుబ్బా నవ్విస్తున్నాయి.

Jabardast latest promo released, జబర్దస్త్​ లేటెస్ట్​ ప్రోమో
జబర్దస్త్​ లేటెస్ట్​ ప్రోమో

By

Published : Nov 27, 2021, 5:45 PM IST

Jabardast new episode: 'చూపే బంగారమాయెనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే' అంటూ అల్లుఅర్జున్​ స్టైల్​లో స్టెప్పు వేసేలా ప్రయత్నించి నవ్వులు పూయించాడు హైపర్​ ఆది. 'బన్నీ ఈ స్టెప్పు వేస్తే వెల్​డన్​ అనేలా ఉన్నాడు, అదే నేను వేస్తే వెల్డింగ్​లు చేసుకునే వాడిలా ఉన్నానంటూ' తనదైన స్టైల్​లో కామెడీగా డైలాగ్​ చెప్పి అలరించాడు. యాంకర్​ అనసూయపై పంచ్​లు విసురుతూ కడుపుబ్బా నవ్వించాడు. ఈ ఫన్​కు వేదిక అయింది తాజా 'జబర్దస్త్​' ఎపిసోడ్​. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది.

మరోవైపు కంటెస్టెంట్​పై జడ్జి రోజా వేసిన పంచ్​లు తెగ నవ్వించాయి. ఇక ఈ షోలో చలాకీ చంటీ, రాకెట్​ రాఘవ, అదిరే అభి టీమ్​లు చేసిన హంగామా అలరిస్తూ, కితకితలు పెట్టిస్తున్నాయి. వీరి స్కిట్​లు ఎపిసోడ్​పై ఆసక్తిని రేపుతున్నాయి. డిసెంబరు 2న ఈటీవీలో ప్రసారం కానుందీ కార్యక్రమం.

ఇదీ చూడండి:'జబర్దస్త్' జడ్జి రోజా.. ఏ పెళ్లికి వెళ్లినా ఈ పాట పక్కా!

ABOUT THE AUTHOR

...view details