కరోనా ఉద్ధృతి దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కఠినతరం చేశారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు నిఖిల్.. కొవిడ్ బాధితుడికి మందులు అందించేందుకు ఆస్పత్రికి వెళ్తుండగా పోలీసులు ఆయన్ని నిలిపివేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిఖిల్ ఓ ట్వీట్ పెట్టారు.
"కొవిడ్ వల్ల తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ఓ వ్యక్తికి మందులు అందించేందుకు ఉప్పల్ నుంచి కిమ్స్ మినిస్టర్స్ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులు నా కారును ఆపేశారు. బాధితుడి వివరాలు, వైద్యుడి రాసిన మందుల చీటి చూపించనప్పటికీ పోలీసులు నన్ను అనుమతించలేదు. ఈ-పాస్ ఉండాల్సిందే అని చెప్పేశారు. అప్పటికీ నేను తొమ్మిదిసార్లు ప్రయత్నించినప్పటికీ సర్వర్లు డౌన్ కావడం వల్ల నాకు ఈ పాస్ దొరకలేదు. దాంతో మెడికల్ ఎమర్జెన్సీ అని చెబితే అనుమతి ఇస్తారని భావించి.. వచ్చాను."