తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వకీల్​సాబ్​' ప్రీ-రిలీజ్​ ఈవెంట్​కు అనుమతి నిరాకరణ - వకీల్​సాబ్​ ప్రీరిలీజ్​ ఈవెంట్​ వార్తలు

'వకీల్​సాబ్​' సినిమా ప్రీ-రిలీజ్​ ఈవెంట్​ నిర్వహణకు హైదరాబాద్​ పోలీసులు అనుమతి నిరాకరించారు. కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేమని జూబ్లీహిల్స్​ పోలీసులు తేల్చిచెప్పారు.

Vakeel Saab movie pre-release event
'వకీల్​సాబ్​' ప్రీ-రిలీజ్​ ఈవెంట్​

By

Published : Mar 30, 2021, 10:23 PM IST

పవర్​స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన 'వకీల్​సాబ్' చిత్ర ప్రీ-రిలీజ్‌ ఈవెంట్​ నిర్వహణకు హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఏప్రిల్ 3వ తేదీన యూసుఫ్‌గూడలోని పోలీసు బెటాలియన్ మైదానంలో ఈ వేడుకను నిర్వహించేందుకు జే మీడియా ఫ్యాక్టరీకి చిత్ర నిర్మాణసంస్థ బాధ్యతలు అప్పగించింది.

ఈ కార్యక్రమానికి దాదాపు 5 నుంచి 6వేల మంది పవన్ కల్యాణ్ అభిమానులు హాజరవుతారని నిర్వహకులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వేడుకకు చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం జే మీడియా ప్రతినిధులు జూబ్లీహిల్స్ పోలీసులను అనుమతి కోరారు. కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ప్రీ-రిలీజ్‌ వేడుకలకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు తేల్చి చెప్పారు.

ఇదీ చూడండి:ఓటీటీ విడుదలకు 'టెనెట్'​ సిద్ధం

ABOUT THE AUTHOR

...view details