ఒక్క హిందీ చిత్రంలో నటిస్తే చాలు అప్పటి వరకు ఉన్న కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది. జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెడుతుంది. అందుకే నాయికలందరూ టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏదో ఒక పరిశ్రమతో పరిచయమై ఒక్కో మెట్టు ఎక్కుతూ బాలీవుడ్ బాట పడుతుంటారు. మరి ఓ నటి పరిచయమే రెండు హిందీ సినిమాలతో అయితే? ఆ సదవకాశమే దక్కించుకుంది హైదరాబాద్-సికింద్రాబాద్ యువతి అమ్రిన్ ఖురేషి. అది కూడా రెండు తెలుగు రీమేక్‌ల్లో.
బాలీవుడ్లో హైదరాబాద్ అమ్మాయి జోరు - Hyderabad Girl Amrin Qureshi
తెలుగు కథలు పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతూ టాలీవుడ్లోనే కాకుండా మిగిలిన చిత్రసీమల్లోనూ అదరగొడుతున్నాయి. అందుకే మన కథలకు క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో గతంలో విడుదలై హిట్టయిన చిత్రాలనూ రీమేక్ చేసేందుకు హిందీ దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్, రాజ్ తరుణ్ సినిమాలకు తాజాగా కొందరు నిర్మాతలు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా.. ఆయా చిత్రాల్లో హీరోయిన్గా హైదరాబాద్ అమ్మాయే ఎంపికైంది.
![బాలీవుడ్లో హైదరాబాద్ అమ్మాయి జోరు Amrin Qureshi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9609789-360-9609789-1605889580633.jpg)
బాలీవుడ్లో హైదరాబాద్ అమ్మాయి జోరు
అల్లు అర్జున్ కథానాయకుడుగా త్రివిక్రమ్ తెరకెక్కించిన 'జులాయి', రాజ్ తరుణ్ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన 'సినిమా చూపిస్త మామ' హిందీలో రీమేక్‌లు అవుతున్నాయి. ఈ రెండింటిలో కథానాయకుడిగా ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి నటిస్తున్నాడు. నాయికగా అమ్రిన్ కనువిందు చేయనుంది. ఏ పాత్రకైనా అమ్రిన్ అందం తీసుకురాగలదని అభిప్రాయం వ్యక్తం చేశారు అక్కడి దర్శకనిర్మాతలు.
Last Updated : Nov 21, 2020, 9:54 AM IST