తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కళ్లు చెదిరే ధరకు 'లక్ష్మీబాంబ్' ఓటీటీ హక్కులు - అక్షయ్ కుమార్ లక్ష్మీబాంబ్ ఆన్​లైన్​లో

'లక్ష్మీబాంబ్' ఓటీటీ హక్కుల్ని దాదాపు రూ.125 కోట్ల మొత్తానికి హాట్​స్టార్ కొనుగోలు చేసిందనే వార్త ప్రస్తుతం హాట్​ టాపిక్​గా మారింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Laxmmi Bomb's digital rights sold over Rs 120 cr
లక్ష్మీబాంబ్​ సినిమాలో అక్షయ్ కుమార్

By

Published : May 29, 2020, 11:32 AM IST

అక్షయ్ కుమార్ నటించిన హారర్ కామెడీ 'లక్ష్మీబాంబ్'.. త్వరలో హాట్​స్టార్​లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓ వాణిజ్య సంస్థ ధ్రువీకరించింది. తొలుత చర్చలు విఫలమైనా, ఆ తర్వాత ఒప్పందం కుదిరిందని చెప్పింది. కొన్నిరోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని స్పష్టం చేసింది.

ఈ సినిమాను ముందుగా రూ.145 కోట్లకు ఓటీటీకి విక్రయించారని ఓ వార్త సంస్థ తెలిపింది. ఆ తర్వాత రూ. 125 కోట్లకు నిర్మాతలు, హాట్​స్టార్ మధ్య ఒప్పందం కుదిరిందని సదరు సంస్థే పేర్కొంది. థియేటర్లలో విడుదలై, వచ్చే కలెక్షన్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ ధరేనని చెప్పుకొచ్చింది. ఈ విషయమే ప్రస్తుతం బాలీవుడ్​ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

లక్ష్మీబాంబ్ సినిమాలో అక్షయ్ కుమార్

ఈ సినిమాలో అక్షయ్ కుమార్, కియారా అడ్వాణీ హీరోహీరోయిన్లుగా నటించారు. దక్షిణాది హిట్​ చిత్రం 'కాంచన' రీమేక్​గా రూపొందించారు. మాతృకను తీసిన రాఘవ లారెన్స్ దీనికీ దర్శకత్వం వహించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details