కార్తి హీరోగా, పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సర్దార్'. రాశీ ఖన్నా, రజిషా విజయన్ కథానాయికలు. సినిమా కోసం చెన్నైలో ఓ భారీ జైలు సెట్‌ను నిర్మించారు. ఇంతటి భారీ సెట్లో పనిచేయడానికి చాలా మంది జూనియర్ ఆర్టిస్టుల అవసరం ఉంటుంది. కానీ, ప్రస్తుతం కరోనా రెండో దశ చూస్తుంటే అంతమంది ఒకే చోట చేరి పనిచేయడం సాధ్యమయ్యే పనికాదు. అందువల్లనే సినిమా షూటింగ్‌ను వాయిదా వేశారు. భవిష్యత్తులో లాక్‌డౌన్, కొవిడ్ కేసుల తీవ్రతను చూసిన తర్వాతే తిరిగి సినిమా షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో చిత్రబృందం ఉందట.
కార్తి 'సర్దార్' కోసం భారీ జైలు సెట్ - movie news
ప్రముఖ కథానాయకుడు కార్తి 'సర్దార్' సినిమా కోసం భారీ జైలు సెట్ నిర్మించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కవమందితో పనిచేయడం కుదరదు కాబట్టి చిత్రీకరణ నిలుపుదల చేశారు.
ఈ సినిమా కథ భారత్ - చైనా దేశాల మధ్య ఉన్న ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా ఉండనుందని మాట్లాడుకుంటున్నారు. జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. 'సర్దార్' తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ వీడియోను విడుదల చేశారు. అందులో కార్తి పొడవాటి జుట్టు, గుబురుగా గడ్డంతో కోపంగా చూస్తున్నట్లు ఉంది. కార్తి సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతూ సందడి చేస్తున్నాయి. కార్తి ‘సర్దార్’ షూటింగ్ వాయిదా నేపథ్యంలో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పొన్నియన్ సెల్వన్' సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారట.