తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్' క్లైమాక్స్ ఫైట్ కోసం అంత ఖర్చా? - రాజమౌళి ఆర్ఆర్ఆర్ అప్​డేట్స్

దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'. రామ్​చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలు. ఇప్పుడీ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఆసక్తిని కలిగిస్తోంది. క్లైమాక్స ఫైట్​ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేసేందుకు చిత్రబృందం సిద్ధమైందట.

RR
ఆర్ఆర్ఆర్

By

Published : Jan 15, 2020, 7:39 PM IST

ప్రముఖ హీరోలు రామ్​చరణ్, జూనియర్ ఎన్టీఆర్​ల మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్​తో తీస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

అదేంటంటే?

ఈ సినిమా క్లైమాక్స్​లో వచ్చే పోరాట సన్నివేశాల కోసం భారీ మొత్తం ఖర్చు చేస్తోందట చిత్రబృందం. దాదాపు రూ.150 కోట్లతో తీస్తున్నారని సమాచారం. ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా ఈ సీన్స్ రూపొందించనున్నారట.

'ఆర్​ఆర్ఆర్'ను రూ.350 కోట్ల బడ్జెట్​తో నిర్మిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాలకు కాస్త కల్పితం జోడించి తెరకెక్కిస్తున్నారు. డీవివి దానయ్య నిర్మాత. ఈ ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. వైరల్: తమిళ హీరోతో రామ్​చరణ్​ డ్యాన్స్

ABOUT THE AUTHOR

...view details