శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'శ్రీకారం'. కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా వల్ల ఆరు నెలల పాటు నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల తిరిగి ప్రారంభమైంది. తిరుపతిలో భారీ తారాగణంతో కీలక షెడ్యూల్‌ను 20 రోజుల పాటు చిత్రీకరించారు. తాజాగా ఇది పూర్తైంది. దీంతో చిత్ర నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
శర్వానంద్ 'శ్రీకారం' లాంగ్ షెడ్యూల్ పూర్తి - srikaram long schedule
తిరుపతిలో శర్వానంద్ నటిస్తోన్న 'శ్రీకారం' సినిమాకు సంబంధించిన లాంగ్ షెడ్యూల్ పూర్తైంది. ఈ సందర్భంగా చిత్రబృందానికి ధన్యావాదాలు తెలిపారు చిత్ర నిర్మాతలు.
శ్రీకారం
కరోనా సమయంలో కూడా తమకు సహకరించి 20 రోజుల షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు నటులు, సిబ్బందికి ధన్యవాదాలు చెప్పారు నిర్మాతలు. మరికొద్ది రోజుల్లో మరో షెడ్యూల్‌ను మొదలు పెట్టి వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
ఇదీ చూడండి రాజశేఖర్‌కు ప్లాస్మాథెరపీ.. నిలకడగా ఆరోగ్యం