ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ 23 గంటల పాటు ఉపవాసం ఉన్నాడు. మనిషి డబ్బుకోసం పరుగెత్త కూడదు. ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు పరుగెత్తాలి. మన జీవితాన్ని చాలా భద్రంగా కాపాడుకోవాలి అంటూ చాలామంది సలహాలు ఇస్తుంటారు. కానీ కొంతమంది మాత్రమే అది చేసి చూపిస్తారు.
23 గంటలు ఉపవాసం ఉన్న హృతిక్ - హృతిక్ రోషన్ తాజా వార్తలు
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ 23 గంటల పాటు ఉపవాసం ఉన్నాడు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశాడు.
హృతిక్
హృతిక్ రోషన్ కూడా ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. తాజాగా హృతిక్ ఇరవై మూడు గంటలపాటు ఉపవాసం చేశాడు. అదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. రోజువారిగా సూర్యుడితో అనుబంధం పెంచుకోవాలి. లేదంటే మన ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పాడు. గతంలో సూర్యుడిని ముద్దాడుతున్నట్లు ఉన్న సెల్ఫీని కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు.
హృతిక్ గతేడాది 'సూపర్ 30' అనే చిత్రంలో నటించాడు. తర్వాత ఈ ఏడాది టైగర్ ష్రాఫ్‌తో కలిసి 'వార్'లో సందడి చేశాడు.