భారత్‌లో లాక్డౌన్ సమయంలో వృద్ధులు, రోజువారి కార్మికులు, అల్ప ఆదాయ వర్గాల వారు చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్.. తాజాగా వారికి సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. అక్షయ పాత్ర ఫౌండేషన్‌తో కలిసి, ప్రతిరోజూ లక్ష 20 వేల మందికి ఆహారం అందజేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకుందీ సంస్థ.
"సూపర్‌స్టార్ హృతిక్‌రోషన్‌తో కలిసి ఈ సాయం చేయనుండటం మా సంస్థకు సంతోషమైన విషయం. కరోనా ప్రభావం తగ్గేవరకు వృద్ధాశ్రమాలకు, రోజువారి కార్మికులకు, అల్పఅదాయవర్గాల వారికి.. లక్ష 20 వేల మందికి ఆహారం అందజేయబోతున్నాం. మాతో కలిసి పనిచేసేందుకు అంగీకరించిన హృతిక్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు" -అక్షయపాత్ర ఫౌండేషన్ ట్వీట్