గత కొద్ది కాలంగా సరైన విజయాల్లేక సతమతమవుతున్న హీరో హృతిక్ రోషన్.. ఇటీవలే 'సూపర్ 30'తో హిట్ అందుకున్నాడు. హృతిక్ నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ముంబయి జుహులోని ఓ వ్యాయామశాల ప్రారంభోత్సవానికి శనివారం హాజరైన ఈ బాలీవుడ్ కథానాయకుడు... వ్యాయామం, తన ఆహార అలవాట్ల గురించి వివరించాడు.
'నా ప్రయత్నం.. ఉత్తమ నటుణ్ని చూపేందుకే ' - సూపర్ 30
ఇటీవలే 'సూపర్ 30'తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు హీరో హృతిక్ రోషన్. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చిత్రబృందాన్ని ప్రశంసించారు. ఆయనకు ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపాడీ కథానాయకుడు. త్వరలో 'క్రిష్', 'వార్' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
అభిమానులతో మాట్లాడుతున్న హృతిక్
" జీవితానికి వ్యాయామం ఎంతో అవసరం. మంచి ఆహారపు అలవాట్లు, ఎక్స్ర్సైజ్తో గాయాలు కాకుండా చూసుకోవచ్చు. నేను సమోసాలు, పిజ్జా, ఐస్‌క్రీం తింటాను కానీ వ్యాయామం చేస్తాను. ఇష్టమైనవి లాగిస్తూనే జిమ్‌కు వెళ్తే శరీరాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. 'సూపర్ 30' సినిమాను ఆదరించినందుకు కృతజ్ఞతలు. నేను ఎప్పుడూ ప్రేక్షకులకు నాలో ఉత్తమ నటుడిని చూపించటానికి ప్రయత్నిస్తాను." -హృతిక్ రోషన్, హీరో
ఇది సంగతి: హృతిక్ 'వార్'కు హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్